కూటమి ప్రభుత్వం శాసనసభలా తాజాగా ఒక బిల్లు ప్రవేశపెట్టింది. రాజకీయ ప్రేరేపిత హత్యలకు గురైన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంఇచ్చి ఆదుకోవడం కోసం బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ వారి దాడుల్లో మరణించిన తెలుగుదేశం కార్యకర్త చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకునే నిర్ణయం తీసుకున్నారు. చంద్రయ్య కొడుకు కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చే బిల్లును శాసనసభ ఆమోదించింది. అయితే.. ఈ బిల్లును మండలిలో బొత్స సత్యనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక విధాన నిర్ణయంగా వ్యతిరేకించారు. ఆ హత్య రాజకీయ ప్రేరేపితం అయినప్పుడు.. వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఎందుకివ్వాలని అని వైసీపీ ప్రశ్నిస్తోంది. కానీ.. ఈ కడుపుమంట వెనుక ఉన్న కారణాల్ని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ హత్యలు అంటే.. దాదాపుగా అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే హత్యలే అయి ఉంటాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీకి చెందిన వారు వ్యక్తిగత, అక్రమ సంబంధాల, తాగుబోతు గొడవల్లో మరణించినా కూడా.. వాటిని రాజకీయ హత్యలుగా రంగుపులమడానికి వైసీపీ ప్రయత్నిస్తుంటుంది. అలాంటిది.. అసలైన రాజకీయ హత్యలు మాత్రం.. తమ పార్టీ వారి తరఫున.. కూటమి కార్యకర్తల మీదనే జరుగుతుంటాయి కదా.. అనే అభిప్రాయం వైసీపీ వారికే ఉన్నట్టుంది. అంటే.. ‘రాజకీయ ప్రేరేపిత హత్యలు’ అనే కేటగిరీలో నష్టపోయేది ఎప్పుడూ తెలుగుదేశం, జనసేన వాళ్లు మాత్రమే గనుక.. వారికి మాత్రమే ఉపయోగపడేలా ఒక విధానం రావడం పట్ల వారికి అభ్యంతరాలు ఉండవచ్చునని అంతా అనుకుంటున్నారు. అందుకే టీడీపీ కార్యకర్త చంద్రయ్య కొడుక్కు ఉద్యోగం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారని అంతా అనుకుంటున్నారు.
ఈ విధానం వల్ల.. రాజకీయ హత్యలు తగ్గుతాయని ప్రభుత్వం వాదిస్తోంది. నారా లోకేశ్ చొరవతోనే.. నిరుపేద చంద్రయ్య కుటుంబానికి ఇలా సాయం చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ జగన్ దళాలు మాత్రం.. తమ పార్టీ వారికి కూడా మేలు జరిగే అవకాశం ఉన్నదని విస్మరించి.. ఈ బిల్లును కుట్రపూరితంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు.
ఆ బిల్లుపై జగన్ దళానికి కడుపుమంట ఎందుకంటే..?
Thursday, December 4, 2025
