నువ్వేనా రోషన్‌ ఇలా మారిపోయావేంటి!

Thursday, December 26, 2024

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ వినాయక చవితి శుభ సందర్భంగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సమకాలీన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుమ-రాజీవ్ కనకాలల కుమారుడు రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రోషన్ కనకాల తన కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ నవ్వుతూ అదరగొట్టాడు. దట్టమైన అడవి మధ్యలో గుర్రంతో కనిపించాడు. ఇక ఈ సినిమాకి మోగ్లీ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక మోగ్లీ జంగిల్ బుక్‌లోని ప్రముఖ పాత్ర పేరుఅని తెలిసిందే. ఇక ఈ కొత్త కథ కూడా అటవీ నేపథ్యంలోనే సాగనుంది. ఇక ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా ఆహ్లాదకరంగా ఉండగా రోషన్ కూల్‌గా కనిపిస్తున్నాడు.

జాతీయ అవార్డును గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన దర్శకుడు సందీప్ రాజ్, కలర్ ఫోటో తరహాలో భావోద్వేగమైన మరో ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక విలన్‌ పాత్ర ఈ సినిమాలో కీలకం కావడంతో మంచి నటుడిని ఎంపిక చేసుకునే పనిలో టీం పడింది. ఇక మోగ్లీ సినిమాకి కాల భైరవ సంగీతాన్ని సమకూర్చనున్నారు. బాహుబలి 1 & 2 , RRR వంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లకు చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ రామ మారుతి M ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

కలర్ ఫోటో, మేజర్,  రాబోయే గూఢచారి 2 వంటి హిట్ చిత్రాలకు ఎడిటర్ అయిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. ఇక మోగ్లీని 2025 వేసవిలో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles