ఆపరేషన్ కాదంబరి’ మాస్టర్ ప్లాన్ ఎవరిది?

Wednesday, January 22, 2025

ముంబాయి నటి కాదంబరి జత్వానీ ని కిడ్నాప్ చేసి, అదుపులోకి తీసుకుని, అరెస్టుచేసి, జైల్లోపెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టిన తీరు తెన్నులను సమగ్రంగా గమనిస్తే ఒక మాస్టర్ ప్లాన్ మనకు కనిపిస్తుంది. కాదంబరి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించిన వివరాలు.. కేసు విచారణ క్రమంలో ఇప్పటికే వెలుగులోకి వస్తున్న వివరాలు, విశాల్ గున్నీ అఫిడవిట్ లోని వివరాలు అన్నీ గమనించినప్పుడు ఇంత మాస్టర్ బ్రెయిన్ వెనుక ఎవరున్నారో కదా? అనే సందేహం కలుగుతుంది. ఆ మాస్టర్ ప్లాన్ ఏమిటో కాస్త గమనించే ప్రయత్నం చేద్దాం. వరుసక్రమంలో పేర్చుకుంటే ప్రజల ఊహల్లో మెదలుతున్న సంగతి ఇలా ఉంటోంది.

కుక్కల విద్యాసాగర్ తో కాదంబరికి ఉన్న అనుబంధం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకున్న ఒక ముసుగు. ఇదంతా కేవలం సజ్జన్ జిందాల్ కోసం చేసిన వ్యవహారం. సజ్జన్ జిందాల్ మీద కాదంబరి ముంబాయిలో అత్యాచారం కేసు పెట్టింది. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ఆయన, ఈ కేసునుంచి బయటపడడానికి మార్గాన్వేషణ చేశారు. జగన్ తో ఉన్న ఆత్మీయ సంబంధం ఆయనకు గుర్తుకు వచ్చింది.

అంతపెద్ద పారిశ్రామిక వేత్త ఆబ్లిగేషన్ అడిగేసరికి జగన్ అత్యుత్సాహంతో స్పందించేశారు. తన కోటరీలోని ముఖ్యులను పురమాయించారు. సకల శాఖల మంత్రి సూత్రధారి బాధ్యత తీసుకుని ఉంటారనేది ప్రచారం. ఇంటెలిజెన్స్ బాస్ పీఎస్ఆర్ ఆంజనేయులు స్వయంగా రంగంలోకి దిగి.. కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలను పిలిపించి ఏ క్రమంలో అడుగులు వేయాలో.. ఎలా అరెస్టు చేసి పట్టుకు రావాలో చెప్పేశారు.

కుక్కల విద్యాసాగర్ ఎంట్రీ ఆ తర్వాత జరిగింది. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఆయనతో కేసు పెట్టించారు. కేసుపెట్టడానికంటె ముందే పోలీసు బృందం సిద్ధమైంది. వారందరికీ ముంబాయికి ఫ్లైటు టికెట్లు బుక్ అయ్యాయి. డిపార్టుమెంట్ కాకుండా బయటివారు బుక్ చేశారు. ఆ బృందం వెళ్లగానే మరో విమానంలో కుక్కల విద్యాసాగర్ వెళ్లాడు. కాదంబరికి పలుమార్లు ఫోను చేస్తూ.. ఆమె ఎక్కడ తిరుగుతున్నదో సమాచారం సేకరించి పోలీసులకు అందించాడు. వారు యూనిఫారం లేకుండా.. రోడ్డు మీద ఆమెను రెండుకార్లతో అటకాయించి.. దాదాపుగా కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టుకు తీసుకువెళ్లినప్పటికి గానీ.. అది కిడ్నాప్ కాదని, అదుపులోకి తీసుకోవడం అని, వాళ్లు పోలీసులని ఆమెకు అర్థం కాలేదు. విజయవాడ తీసుకువచ్చి ముంబాయిలో కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరించారు. అనుకున్నట్టే చివరి అంకం కూడా పూర్తయి ఉంటే చాలా మంది భారీగా లాభపడి ఉండేవాళ్లేనేమో.

కానీ ప్రభుత్వం మారింది. బాగోతం బయటకు వచ్చింది. ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టడానికి పాత్రధారులు ఒక్కొక్కరుగా సిద్ధం కావాల్సిన పరిస్థితి. సూత్రధారులు ఎవ్వరో లెక్క తేలవలసిన పరిస్థితి! ఇంత చాకచక్యమైన మాస్టర్ ప్లాన్ ఎవరిదనే విషయం మాత్రం పలువురికి సందేహంగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles