ప్రమోషన్స్‌ లో వారిని బాగా వాడుకుంటున్నారుగా!

Tuesday, December 9, 2025

హీరో నితిన్ నటిస్తున్న తాజా సినిమా “తమ్ముడు” షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇప్పుడిప్పుడే రిలీజ్‌కు రెడీగా ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. దీని వలన కొంతకాలంగా ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయే పరిస్థితి కనిపించడంతో, మళ్లీ బజ్ తెచ్చేందుకు చిత్ర బృందం కొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా తాజాగా సినిమా టీం ఒక ఎంటర్‌టైనింగ్ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో నటించిన మహిళా పాత్రధారులు కలిసి సరదాగా పంచుకున్న వీడియో ఇది. ఈ ప్రోమోలో వాళ్లంతా సినిమా రిలీజ్ డేట్ తామే రివీల్ చేయించామని పోటీ పడుతుండటం ఆసక్తికరంగా ఉంది. ఈ సన్నివేశాలను ఇంకా బాగా కనెక్ట్ అయ్యేలా కొన్ని ఫన్నీ మీమ్స్‌ జతచేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరోవైపు, ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను జూన్ 11న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రకటించాడు. సినిమాలో నితిన్‌తో పాటు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక, లయలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles