బొత్సగారు భలే జోకులేస్తున్నారుగా…అచ్చెనాయుడు సెటైర్లు!

Sunday, December 22, 2024

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వీరి భేటీ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో, వీరి సమావేశం గురించి వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ట్వీట్ చేశారు. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలవడం కోసం సీఎంల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ ట్వీట్ కు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు.

బొత్సగారు భలే జోకులు వేస్తున్నారంటూ అచ్చెన్న ఎద్దేవా చేశారు. పారదర్శకత గురించి మీరు, జగన్ మాట్లాడితే జనాలు నవ్విపోతారు… వద్దులెండి అని అన్నారు. పారదర్శకతకు పాతరేసిందే మీరు, మీ పార్టీ అని విమర్శించారు. ప్రెస్ మీట్లు కూడా లైవ్ ఇవ్వకుండా… ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. వాస్తవాలు, పారదర్శకత వంటి పెద్దపెద్ద పదాలు మీరు ఉపయోగించకూడని పదాలని అచ్చెన్నాయుడు చెప్పారు. ఏపీ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉందని… మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. సమావేశమయ్యాక అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles