ఓటీటీలో ఎప్పుడంటే..!

Thursday, April 10, 2025

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన హార్రర్ చిత్రం ‘టుక్ టుక్’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ చిత్రంగా నిలిచింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా వెనుకబడింది. దీంతో ఈ సినిమాకు థియేటర్లలో సరైన రెస్పాన్స్ దక్కలేదు. కాగా, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ డెబ్యూ కి సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ‘టుక్ టుక్’ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఆనందిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో శాన్వీ మేఘన, హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సుప్రీత్ సి.కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను చిత్రవాహిణి ప్రొడక్షన్స్, ఆర్‌వైజి సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles