తండేల్‌ ఓటీటీ విడుదల ఎప్పుడంటే!

Andhrawatch
1 Min Read

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’ ఫిబ్రవరి 7న గ్రాండ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను డైరెక్టర్‌ చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి లవ్ స్టోరీ పీరియాడిక్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను GA2 బ్యానర్‌పై బన్నీ వాస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయ్యిందని.. అయితే, ఈ చిత్ర ఓటీటీ రైట్స్ రూపంలో సగానికంటే ఎక్కువగా రికవర్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇక తండేల్ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

Share This Article