ఆ సినిమా తమిళ ట్రైలర్‌ను లాంఛ్‌ చేసిన విజయ్ సేతుపతి!

Sunday, February 16, 2025

రణం’ మూవీతో డైరెక్టర్‌ గా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. ‘తల’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌కు తెలుగులో అద్భుతమైన స్పందన అందుకుంది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతుండటం మరో విశేషం.

తాజాగా ఈ సినిమా తమిళ్ ట్రైలర్ ను వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చూసిన విజయ్ సేతుపతి ఇంప్రెస్ అయ్యారు. ఓ స్టార్ హీరో రేంజ్ లో కనిపిస్తోంది మూవీ అని చిత్ర యూనిట్‌ పై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి మూవీతో డెబ్యూ ఇవ్వడం అనేది ఖచ్చితంగా రాగిన్ రాజ్ కు చాలా పెద్ద కెరీర్ ను ఇస్తుందని అన్నారు. తమిళ్ లో ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు

విజయ్ సేతుపతి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో బిజినెస్ పరంగానూ ‘తల’ ఊహించిన దానికంటే చాలా ఫ్యాన్సీ గా వెళుతోంది. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ‘తల’ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘వయొలెంట్ వాలెంటైన్’ అనే పేరుతో ప్రమోషన్స్ చేస్తూ విడుదల చేస్తుండటం మరో ఆసక్తికర విశేషం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles