పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా డైరెక్టర్లు జ్యోతికృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి అల్రెడీ వచ్చిన పవన్ ట్రీట్ మాట వినాలి సాంగ్ మంచి హిట్ అయ్యింది.
ఇక ఇపుడు సినిమా రెండో సాంగ్ పై ఇపుడు ఓ టాక్ వినపడుతుంది. దీని ప్రకారం మేకర్స్ నెక్స్ట్ ఒక రొమాంటిక్ నెంబర్ ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఈ ఫిబ్రవరి 14న వదిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ పాట పవన్ కి నిధి అగర్వాల్ నడుమ ఉంటుందని టాక్ వినపడుతుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఒకటి రావాల్సి ఉంది.