రవితేజ 76 సినిమా ఎప్పుడంటే..!

Monday, December 8, 2025

మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన మాస్ జాతర చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. భాను బోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా తరువాత రవితేజ మరో కొత్త ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆయన కెరీర్‌లో 76వ సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం RT76 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ డీల్స్ పూర్తయ్యాయి. ఓటీటీ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకోగా, శాటిలైట్ హక్కులు జీ తెలుగు చానల్ దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. మంచి ఫ్యాన్సీ రేటుకే ఈ డీల్స్ క్లోజ్ అయ్యాయని ఫిలిం నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles