హను-మాన్‌ అక్కడ రిలీజ్‌ ఎప్పుడంటే!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘హను-మాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా పూర్తి ఫిక్షనల్ సూపర్ హీరో మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా తన  సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

కాగా, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ‘హను-మాన్’ అన్ని భాషల్లో విజయం సాధించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా మారుతోంది. ఈ చిత్రాన్ని జపాన్ దేశంలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. ఈ సినిమాని అక్టోబర్ 4న జపాన్ దేశంలో విడుదల చేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా ట్వీట్ లో పేర్కొన్నాడు.

దీంతో ఈ సినిమా జపాన్‌లో ఎలాంటి సెన్సేషన్స్‌  క్రియేట్ చేస్తుందా అని ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles