ఓటీటీలోకి కూలీ ఎప్పుడంటే..!

Friday, December 5, 2025

తమిళ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రజనీకాంత్ తాజా చిత్రం కూలీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం, థియేటర్లలో మంచి వసూళ్లను నమోదు చేసింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటి వరకు సుమారు 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.

అయితే, మొదట ఊహించినట్టుగా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే అంచనాలను మాత్రం ఈ సినిమా అందుకోలేకపోయింది. ముఖ్యంగా కథనం బలహీనంగా ఉండటమే దీనికి పెద్ద అడ్డంకిగా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రజనీకాంత్ స్టైల్‌తో పాటు సౌబిన్ షాహిర్, రచితా రామ్ చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ సినిమా గురించి ఇప్పుడు అందరిలోనూ ఉన్న పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఇది ఎప్పుడు ఓటీటీలో వస్తుందన్నది. ఇప్పటికే డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో ఈ నెల 11వ తేదీ నుంచే కూలీ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కావచ్చని కోలీవుడ్ వర్గాల చర్చ నడుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles