మామయ్య కన్నీళ్లే ఇంకిపోయిన వేళ..!

Monday, December 23, 2024

జగన్మోహన్ రెడ్డికి ఆశ్రిత పక్షపాతం ఉన్నదా? బంధుప్రీతి ఉన్నదా? కులాభిమానం ఉన్నదా? ఏ లక్షణం ఉన్నది.. అనే ప్రశ్న వేస్తే తటాల్న ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే.. ఆయనను నమ్మి అన్ని అవకాశాలను వదులుకుని వచ్చిన మైసూరారెడ్డి వంటి పెద్దలను కూడా అవమానకరంగా పార్టీనుంచి బయటకు పంపిన ఆయనకు ఆశ్రితపక్షపాతం ఉందనలేం. రెడ్డి కులస్తులే పలువురు ఆయనను ద్వేషిస్తున్న నేపథ్యంలో కులాభిమానం అనలేం. ఇక బంధుప్రీతి విషయానికొస్తే.. సొంత చెల్లెలినే పార్టీనుంచి బయటకు గెంటిన చరిత్ర చూస్తూ ఎలా చెప్పగలం? ఆయనకు ఉండేది తనమీద తనకు దురభిమానం మాత్రమే.. తనకు విధేయుల్ని మాత్రమే, తనకు జై కొట్టే వారిని మాత్రమే, ఎదురుచెప్పకుండా తన ప్రీతికోసం తియ్యటి మాటలు చెప్పే వారిని మాత్రమే చేరదీయడం, అలా చెప్పినంత వరకు మాత్రమే వారికి విలువ ఇవ్వడం ఆయన అసలు లక్షణం అని ఇప్పుడు అర్థమవుతోంది.

ఒకప్పుడు, కష్టకాలంలో జగన్ వెన్నంటి ఉండి చక్రం తిప్పిన, ఆయనకు అండదండగా ఉన్న సొంత మామయ్య బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలోకి చేరిపోవడం అనేది ఆ పార్టీలో చాలా మందికి షాక్. ఆయనే వెళ్లిపోయిన తర్వాత.. ఏ రకంగా జగన్ ను నమ్మి అక్కడ కొనసాగగలం అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. అదంతా ఒక ఎత్తు అయితే… జనసేనలో చేరడానికి పవన్ కల్యాణ్ ను కలిసి ముహూర్తం నిర్ణయించుకున్న తరువాత.. బాలినేని విలేకర్లతో చెప్పిన ముచ్చట గమనిస్తే.. ఇక ఆ పార్టీలో ఉండడానికి ఎవరైనా భయపడతారేమో అనిపిస్తుంది.

తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ మీద గౌరవంతోనే జగన్ ను ఇన్నాళ్లూ భరించానని, కొన్ని రోజులు ఆ పార్టీలో ఏడ్చానని, కళ్లలో నీళ్లు కూడా ఇంకిపోయాయని బాలినేని చెప్పుకొచ్చారు. వైసీపీ కేవలం ఒక కోటరీ ద్వారా నడుస్తోందని ఆయన అన్నారు. అధికారంలో ఉండగా.. తాను వెళ్లి ప్రజలు ఏమనుకుంటున్నారో చెబితే.. నేను నెగటివ్ గా ఆలోచిస్తున్నానని జగన్ అనుకునేవాళ్లు అంటూ వాస్తవం వెల్లడించారు. తనకు అయిష్టమైన సంగతులు చెబితే జీర్ణం చేసుకోలేని జగన్ మోనార్క్ వైఖరి వల్లనే ఇవాళ.. పార్టీ వీడుతున్నట్టు చెప్పారు. చూడబోతే.. మామయ్యకే కన్నీళ్లు ఇంకిపోయే పరిస్థితి వచ్చిందంటే.. ఇక ఆ పార్టీలోని ఇతర నాయకులకు కన్నీళ్లుగా రక్తం కారినా కూడా జగన్ తో కలిసి నడవలేని పరిస్థితి వస్తుందేమో అని పలువురు అంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles