తంగలాన్‌ ట్రైలర్ విడుదల తేదీ ఎప్పుడంటే!

Sunday, December 22, 2024

కోలీవుడ్‌ స్టార్‌ యాక్టర్ విక్రమ్‌ ప్రధాన పాత్రలో స్టార్‌ దర్శకుడు పా. రంజిత్‌ కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా తంగలాన్‌. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటుంది.

ఇప్పటి వరకు మూవీ మేకర్స్‌ సినిమా విడుదల తేదీని  ప్రకటించకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే ట్రైలర్ విడుదల గురించి మేకర్స్ సరికొత్త ప్రకటన చేశారు.. తంగలాన్ సినిమా ట్రైలర్ ను జులై 10, 2024 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి చిత్ర బృందం సరికొత్త పోస్టర్‌ ని విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో విక్రమ్ లుక్ అభిమానులను అలరిస్తుంది. అయితే ఈ ట్రైలర్ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 2 నిమిషాల 12 సెకన్ల నిడివితో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఆడియెన్స్ ను ఆకట్టుకోనుంది. ట్రైలర్‌లో విడుదల తేదీ కూడా ఉంటుందని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్‌ వినిపిస్తుంది.

పవర్ ఫుల్ మూమెంట్స్‌తో ట్రైలర్‌ను మేకర్స్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ట్రైలర్ విడుదల సినిమా పై బజ్ పెరుగుతుందని అంతా భావిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్ కథానాయికగా చేస్తుంది. ఈ సినిమాలో పార్వతి తిరువోతు, పశుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles