ఓజీ ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడంటే!

Tuesday, April 8, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న డైరెక్ట్ సినిమా ఓజి. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్‌ లో  తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2, పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ సెన్సేషన్ రెస్పాన్స్ ను క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డేకి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసి, ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నారు మూవీ మేకర్స్‌. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో వెయిట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles