బోర్డర్‌ 2 విడుదల ఎప్పుడంటే!

Monday, December 8, 2025
బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ ఇటీవల నటించిన జాట్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా హిట్ కావడంతో మేకర్స్ ఇప్పటికే సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇదిలా ఉండగా, సన్నీ నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన సీక్వెల్ “బోర్డర్ 2”. గదర్ 2 తర్వాత ఆయన చేస్తున్న ఇది మరో పెద్ద ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది.

ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బోర్డర్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ చూసినవాళ్లందరికీ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అదే సమయంలో వచ్చే ఏడాది జనవరి 22న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న దానిపై ప్రేక్షకుల దృష్టి పడింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles