ఫలితం ఏది వచ్చినా నాలాగే ఉండాలి..స్టార్ హీరో షాకింగ్‌ కామెంట్‌!

Wednesday, January 22, 2025

ఏపీలో శుక్రవారం ఇంటర్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి , ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేయగా..చాలా మంది మంచి మార్కులతో పాసైన సంగతి తెలిసిందే. కొందరికి ఫస్ట్ క్లాస్ మార్కులు రాగా.. మరికొందరు పాస్‌ మార్కులతో పాస్‌ అయ్యారు. అయితే తప్పిన విద్యార్థులు మరోసారి పరీక్షల్లో యుద్దం చేసేందుకు రెడీ అయ్యారు.

కానీ కొందరు విద్యార్థులు మాత్రం క్షణికావేశంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి వారి కోసం ఓ మోటివేషనల్ ట్వీట్ వదులు అంటూ ఓ నెటిజన్ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థను అడిగాడు. ఆ నెటిజన్‌ కామెంట్ పై స్పందించిన నిఖిల్‌ తన ట్విటర్‌ ఖాతాలో  ‘జీవితంలో విజయం సాధించాలంటే పరీక్షలు మాత్రమే అవసరం లేదు. చూసారు గా #HappyDays లో రాజేష్ కేవలం ఒక్క ఇంగ్లీష్ పోయంతో సాఫ్ట్‌వేర్‌లో బెస్ట్ జాబ్ వస్తుంది.. అలా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో తమదైన రీతిలో అద్భుతమైన అవకాశాన్ని పొందుతారు.. దానిని వినియోగించుకోండి.. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి’ అంటూ అదిరిపోయే కొటేషన్ పెట్టాడు.

అయితే.. ‘హ్యాపీ డేస్‌’ మూవీలో నిఖిల్.. ఫస్ట్ ఓ కేర్‌లెస్ వ్యక్తిగా కనిపించినా… చివరిలో ఉద్యోగంలో మంచిగా సెటిల్ అవుతాడు. దీనిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లండి అనే ఉద్దేశం వచ్చేలా నిఖిల్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles