ఇలాంటి ధూర్తులకు ఏ శిక్షలు వేయాలి!?

Sunday, December 22, 2024

ఒక అత్యాచారం జరిగితే మహిళ పేరు బయటకు రాకుండా చూడాలనేది ప్రాథమిక నైతిక నియమం. పోలీసులు కూడా పేర్లను వెల్లడించరు. మీడియాలో కూడా రాయకూడదు. అత్యాచారం సంగతి అటుంచితే ఒక నేరంలో మైనర్ ఉన్నట్లయితే.. ఏ రకంగానూ ఆ పేరు చెప్పకూడదనేది నియమం. అత్యాచారం మైనర్ పై జరిగితే.. ఇంకా సంయమనంతో ఉండాలి. సానుభూతితో ఉండాలి. కానీ.. ఒక చిన్న సంఘటన ఏమూల జరిగినా చాలు.. దాన్నుంచి రాజకీయ ప్రయోజనాల్ని పిండుకోవడానికి రాద్ధాంతం చేయాలని చూస్తే ధూర్త నాయకుల పోకడలను ఎలా అర్థం చేసుకోవాలి.

ఒక మైనర్ అమ్మాయి మీద, దుండగులు దాడికి పాల్పడితే.. దానిని అత్యాచారంగా చిత్రించి ప్రభుత్వం మీద బురద చల్లడానికి పూనుకునే తప్పుడు బుద్ధులవారిని ఎలా అర్థం చేసుకోవాలి? అత్యాచారాల గురించి ప్రభుత్వం మీద బురద చల్లుతూ.. ప్రెస్ మీట్ లో అత్యాచారానికి గురైన అందరి పేర్లు, ఊర్లు  చదివి వినిపించే ధూర్తులకు ఎలాంటి శిక్షలు వేయాలి? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. తిరుపతిలో జరిగిన సంఘటన, వైసీపీ వారి అత్యుత్సాహం ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

యర్రవారి పాళెం మండలంలో ఓ పద్నాలుగేళ్ల బాలికకు ఇద్దరు అబ్బాయిల నుంచి ప్రేమ పేరుతో చాలా కాలంగా వేధింపులు ఉన్నాయి. సోమవారం నాడు పాఠశాల నుంచి ఆమె తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు వారు అటకాయించి ఆమెను ప్రేమ గురించి అడిగారు. తిరస్కరించడంతో దాడిచేశారు. ఆమెకు రెండుమూడు చోట్ల స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు అయింది. ఆమెను చికిత్స నిమిత్తం తిరుపతి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

రాష్ట్రంలో ఎక్కడ ఏ బిడ్డ మీద అత్యాచారం జరుగుతుందా? వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోదామా? ప్రభుత్వానికి చేతకావడం లేదని నిందలు వేద్దామా అని కాచుకుని ఉండే వైసీపీ మూకలు ఆస్పత్రి వద్దకు వాలిపోయాయి. బాలికపై అత్యాచారం జరిగిందంటూ  ప్రచారం ప్రారంభించేశారు. ఆ బాలిక తండ్రి షాక్ తిని, కేవలం దాడి జరిగింది.. రెండు చోట్ల గాయాలయ్యాయి.. అంతమాత్రానికే మీరు మా కుటుంబం పరువు తీయొద్దంటూ కన్నీళ్లతో కాళ్లావేళ్లాపడి బతిమాలాల్సి వచ్చింది.

వైసీపీ నాయకులు  ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడడం పట్ల ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఆ బాలికపై అత్యాచారం జరగనేలేదని పోలీసు ఎస్పీ కూడా చెబుతున్నారు. అయినా కేవలం తమ కుటిల రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడే ఇలాంటి వారికి కఠిన శిక్షలు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles