సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, కింగ్ నాగార్జున ప్రతినాయకుడిగా, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కన్నడ హీరో ఉపేంద్ర, మళయాళ నటుడు సౌబిన్ వంటి ప్రముఖులు నటించిన భారీ మల్టీ స్టారర్ మూవీ కూలీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యింది. ఫైనల్ గా విడుదలకు రెడీ అయింది. దీంతో థియేటర్స్ లో ఈ సినిమా ఎంతసేపు నడుస్తుందనే ఆసక్తికరమైన విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ మూవీ రన్ టైమ్ దాదాపు 3 గంటల సమీపంలోనే ఫిక్స్ అయింది. స్పష్టంగా చెప్పాలంటే, కూలీ టోటల్ నిడివి 2 గంటల 49 నిమిషాలు 57 సెకండ్లు. ఇది డైరెక్టర్ లోకేష్ గత చిత్రాల రన్ టైమ్‌ను పోలి ఉంటుంది. ఆయన స్టైల్‌లోనే మళ్ళీ ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా చూడబోతున్నాం అనిపిస్తోంది.
కూలీ సినిమాపై ఉన్న అంచనాలను బట్టి చూస్తే, ఇది ఆగస్టు 14న థియేటర్స్ లో విడుదలయ్యే సమయంలో ప్రేక్షకులకు ఒక భారీ విజువల్ ట్రీట్ అందించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న ఈ మూవీ, కథ, తారాగణం, మరియు దర్శకుడి మార్క్‌కి తగ్గట్టే సినిమా ఉండబోతుందన్న నమ్మకం ఫ్యాన్స్‌లో నెలకొంది.
