మోక్షు మూవీ పై తాజా అప్డేట్‌ ఏంటంటే!

Andhrawatch
1 Min Read

మోక్షు మూవీ పై తాజా అప్డేట్‌ ఏంటంటే! ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భారీ చిత్రం “డాకు మహరాజ్” విడుదలకి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య, బాబీ కాంబోలో ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇపుడు క్రేజీ హైప్ అయితే నెలకొంది.

ఇక ఈ సినిమా కాకుండా నందమూరి అభిమానులని ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది నందమూరి నటసింహ వారసుడు నందమూరి మోక్షజ్ఞ మూవీ కోసమే అని చెప్పుకొవచ్చు. టాలెంటెడ్ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆమధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ ఇపుడు వీటిపై ఓ క్లారిటీ వస్తుంది.

దీంతో ఈ సినిమా ఈ రానున్న ఫిబ్రవరి నుంచే సెట్స్ మీదకి వెళ్లనున్నట్టు సమాచారం. దీంతో నందమూరి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకొవచ్చు.

Share This Article