నీతులు చెప్పే భూమన ఇప్పుడేం  అంటారో..?

Monday, December 8, 2025

వారి దుర్మార్గాలకు జడుసుకున్న ప్రజలు అత్యంత దారుణంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరైనా సరే పోయిన పరువును తిరిగి నిలబెట్టుకోవడం గురించి తపన పడతారు. అందుకోసం కష్టపడతారు. అలాకాకుండా.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి దుర్మార్గాలకు, అరాచకాలకు అయితే తెగించారో.. పదవీ భ్రష్టులు అయిన తర్వాత కూడా అదేవిధంగా చెలరేగిపోవాలని అనుకునే వారు కొందరే ఉంటారు. తమకు అడ్డూ అదుపూ ఉండదని విర్రవీగుతుంటారు. అలాంటి వారినే భూమన అనుచరులు అని పిలుస్తారు!

తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి హవా సాగినంత కాలమూ.. ఆయన అనుచరులు పాల్పడని అరాచకాలు, దుర్మార్గాలు లేవు. బెదిరింపులు, భూకబ్జాలు, సెటిల్మెంట్లు, తిరుమల దర్శన టికెట్ల విక్రయాలు.. ఒకటేమిటి వారు చేయని తప్పుడుపని లేదు. భూమన అప్రకటిత రాజకీయ సన్యాసంతో.. తిరుమల గిరులను దోచుకునే పదవిలోకి మళ్ళుకున్నప్పటికీ, ఆయన కొడుకు అభినయ్ రెడ్డిని తిరుపతి ప్రజలు దారుణంగా ఓడించారంటే.. వారి అనుచరుల ఆగడాలతో విసిగిపోయి ఉండడమే కారణం. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోయిన ప్రతిచోట వైసీపీ నాయకులు కిక్కురుమనకుండా పడుతున్నారు. ఇదివరకటిలా పోలీసులు ఊరుకోరని, తప్పు చేస్తే దండన తప్పదనే భయం వారికి ఉంది. కానీ భూమన అనుచరులు స్టయిలే వేరు. అధికారం తమది కాకపోయినా తమ రౌడీయిజం కొనసాగాలనే కోరిక వారిది.

వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ అనిల్ రెడ్డి, పవన్ అనే గిరిజన యువకుడిని కిడ్నాప్ చేశాడు.  ఇంటిలో నిర్బంధించి చితక్కొట్టాడు. ఎందుకో తెలుసా .. శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా పవన్ కు ఒక దుకాణముంది. ఆ కాంట్రాక్టును తన పేర రాసి ఇవ్వాలని నిర్బంధించాడు. పవన్ ను కొడుతున్న వీడియో బయటకు వచ్చింది. పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా, తన ఇంట్లో కూర్చుని నీతులు వల్లిస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారని అనే భూమన.. ఇప్పుడు తన అనుచరుల ఆకృత్యాలపై ఏమి నీతులు వల్లిస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles