గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ అండ్ గ్రాండ్ మూవీ “మిరాయ్” మొదటి వారం రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా కనిపించాడు. రిలీజ్ కి ముందే మంచి అంచనాలు ఏర్పడటంతో, సినిమా మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లు సాధించింది. వీకెండ్ వరకు మంచి వేగాన్ని అందుకున్న ఈ చిత్రం, వారం రోజులు పూర్తయ్యే సరికి కూడా బాక్సాఫీస్ దగ్గర బలమైన పట్టు చూపింది.
తాజాగా మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, “మిరాయ్” ఏడు రోజుల్లో దాదాపు 112 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ వసూళ్లతో తేజ సజ్జ కెరీర్ లో ఇది ఒక పెద్ద మైలురాయిగా నిలిచిందని చెప్పొచ్చు.
ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందించగా, రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. మంచు మనోజ్ విలన్ పాత్రలో పవర్‌ఫుల్ ఇంపాక్ట్ చూపించగా, శ్రేయ, జైరాం లాంటి నటులు ముఖ్యమైన రోల్స్ చేశారు.
