మీకు మేమెప్పుడు సేవకులమే..పెత్తందార్లం కాదు..!

Wednesday, January 22, 2025

జులై 1 2024..సోమవారం..ఏపీలో ఏ ఊరు చూసిన పండగను తలపిస్తుంది. కానీ నేడు ఏ పండుగ కాదు..కానీ ఉదయం 6 గంటలకే ప్రతి ఇళ్లు కూడా ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు.  కావాల్సిన వారు వస్తారు…మాకు కావాల్సినది తీసుకుని వస్తారని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారంతా ఎదురు చూసినట్లుగానే ఉదయం 6 గంటల కల్లా సచివాలయ సిబ్బంది, ఎమ్మెల్యేలు, మంత్రులు…చివరికీ ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ పెన్షను అందించారు.

ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు అయ్యింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఎంతో ప్రెస్టిజియస్‌ మొదలు పెట్టిన తొలి కార్యక్రమంతో పాటు..మేనిఫెస్టోలో తెలిపిన హామీల్లో ఒకటి అయిన పింఛన్ల పెంపు కార్యక్రమం కావడంతో సర్వత్రా ఆసక్తి, ఆనందం, సంతోషం మొదలు అయ్యాయి.

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛన్ నగదు మొత్తాన్ని స్వయంగా చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్‌ అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో  పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో ఉత్సవ వాతావరణం ఏర్పడింది.

పింఛన్ల పంపిణీ తరువాత జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలి సభను టీడీపీ మంచి పట్టు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగిందని చంద్రబాబు అన్నారు. ఎప్పుడూ ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగానే ఉందని, మిత్రపక్షాలను పోటీలో నిలబెట్టినప్పటికీ కూడా గెలిచామని తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు గత ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.

రాష్ట్రం మీద అప్పులు ఎన్ని ఉన్నాయో ఇంకా తనకే తెలియదని వ్యాఖ్యానించారు. దొరికిన అన్ని చోట్లా అప్పులు చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని , రాష్ట్ర రాజకీయాలను భ్రష్టుపట్టించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రముఖ్యమంత్రిగా కాదు కదా..కనీసం రాజకీయ నాయకునిగా ఉండటానికి కూడా తాను పనికి రాను అని ఓ వ్యక్తి గత ఐదు సంవత్సరాలలో  నిరూపించుకున్నాడు, కనీసం ఇప్పుడు ఆ వ్యక్తి పేరు పలకడానికి కూడా తాను ఇష్టపడట్లేదని చంద్రబాబు అన్నారు.

ఏపీ ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ అందరూ కూడా ప్రజలకు సేవకులగా ఉంటారని, తాము పెత్తందారులం కాదని..ఎల్లప్పుడూ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే పనివారమని బాబు ఈ సందర్భంగా అన్నారు. ఎలాంటి ఆడంబరాల జోలికి వెళ్లకుండా సింపుల్‌గా ఉంటామని పేర్కొన్నారు. పరిపాలన అనేది ప్రజలకు సేవ చేయడానికే తప్ప వారిపై ఆధిపత్యం, పెత్తనం చలాయించడానికి కాదని బాబు గట్టిగా చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles