మేము మేము బాగానే ఉన్నాం..మీకేంటి రా సామి!

Sunday, December 22, 2024

సినిమా ప్రపంచంలో హీరోల మధ్య పోటీ అనేది సహజం. అయినప్పటికీ కూడా వారంతా ఎంతో క్లోజ్ గా ఉంటారు. ఫంక్షన్లు, పార్టీలు, వెకెషన్లు ఇలా అన్నింటికి కలిసి వెళ్తుంటారు. ఆ ఫోటోలను కూడా షేర్‌ చేస్తుంటారు. కానీ వారి అభిమానులు మాత్రం మేము గొప్పంటే మా హీరో గొప్పంటూ దెబ్బలాటలు, గొడవలకు దిగుతుంటారు.

ఈ క్రమంలోనే మరోసారి తెరమీదకు యంగ టైగర్‌..అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మధ్య గొడవలు మరోసారి బయటకు వచ్చాయి. అదెలా అంటే..స్టార్ హీరోలు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన చిన్న హీరోలకు సపోర్ట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండకి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తుంటే… జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్ సేన్‌, సిద్దు జొన్నలగడ్డకి సపోర్ట్ ఇస్తున్నాడు.

ఇదంతా వాళ్ల వరకు బాగానే ఉంది కానీ, బయట ఫ్యాన్స్ మాత్రం గొడవలు పెట్టుకుంటున్నారని పమాచారం. ఎందుకంటే కొన్ని విషయాల్లో విజయ్ దేవరకొండకి విశ్వక్ సేన్‌కి మధ్య చాలా గొడవలు వచ్చాయని సమాచారం. అల్లు అర్జున్ విజయ్ దేవరకొండకి, ఎన్టీఆర్ విశ్వక్ సేన్‌కి సపోర్ట్ చేయడంతో ఫ్యాన్స్ మధ్యలో పోరు మొదలైందని సమాచారం.

దీంతో ఇటు అల్లు అర్జున్, అటు ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ మధ్య ఇలాంటి గొడవలు సహజమే అయినప్పటికీ ఇవి ఎంత వరకు దారి తీస్తాయో అని కొందరు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles