కల్కి ఈవెంట్ ఆరోజు కష్టమేనా?

Friday, September 13, 2024

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. ఈ సినిమాని మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌, కోలీవుడ్‌ అగ్ర హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు. బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చిత్ర యూనిట్ చాలా బిజీ గా వుంది. త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ ను మూవీ టీం మొదలు పెట్టనుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్  వేడుక మే 22 గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ కోసం మేకర్స్ రామోజీ ఫిలిం సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ జరగదు అనే అనుమాన అభిమానుల్లో మొదలైంది.

కల్కి విడుదల జూన్ 27 కావడంతో నెల రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు చేస్తున్నారు అనే సందేహం చాలా మందిలో ఉంది. కొందరు అయితే జూన్ లో ప్రభాస్ అందుబాటులో ఉండదనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ ను మే లో జరుపుతున్నారని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles