ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఇక తుది విడత కసరత్తు చేయవలసిన అవసరం రాజకీయ నాయకులు పనిగా మారింది. ప్రచారంలో ఎంతెంత హంగామా సృష్టించినా సరే, అంతిమంగా ఓట్లకు డబ్బు చెల్లిస్తే తప్ప ప్రయోజనం ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. ఓట్లు కొనడానికి అత్యుత్తమ మార్గంగా వాలంటీర్లనే ఎంచుకుంటున్నారు. తమ పార్టీ కార్యకర్తలే అయిన వాలంటీర్లను ఇప్పుడు బలవంతంగా రాజీనామా చేయించి మరీ, డబ్బు పంపిణీ అవసరాల కోసం వాడుకుంటూ ఉండడం గమనార్హం.
వాలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేసిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచనలే ఉన్నాయి. గ్రామాలలో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు, పట్టణాలలో ప్రతి వంద కుటుంబాలకు ఒకరు వంతున నిత్యం ప్రజలతో అనుసంధానమై ఉంటూ వారిని ప్రభావితం చేయగల శక్తివంతమైన వ్యవస్థగా వాలంటీర్ల రూపుదిద్దాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. అందుకే పూర్తిగా వైసిపి కార్యకర్తలను మాత్రమే ఆ పోస్టుల్లో నియమించుకున్నారు. వారికి ఎప్పటికప్పుడు జగన్ మీద భక్తి నూరిపోస్తూ.. జగనన్న ఉంటే తప్ప ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడ ఆగిపోతాయని చెప్పిస్తూ వచ్చారు.
తీరా ఇప్పుడు ఎన్నికల సందర్భం వచ్చేసరికి వాలంటీర్లను పంపి సంక్షేమ పథకాల లబ్ధిదారులను మభ్యపెట్టే అవకాశం లేకుండా పోయింది. వారు పార్టీ ప్రచారంలో పాల్గొంటే కూడా ఎన్నికల సంఘం వారి మీద వేటు వేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో వారిని అడ్డదారుల్లో వాడుకోవడం సాధ్యం కాదని పార్టీకి అర్థం అయిపోయింది. ఇప్పుడు వారందరితో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు విస్తృతంగా ఉన్నాయి కనుక వారి ద్వారా మాత్రమే ఓట్లు కోసం డబ్బు పంపిణీ చేయించాలని పార్టీ వ్యూహారచన చేస్తున్నది. మరి మీరు ఎత్తులో పైఎత్తులలో వాలంటీర్ల ద్వారా ఓట్లు కొనుగోలు కోసం ఎలా గ్రంథం నడిపించగలరో, ఇంత మేరకు సక్సెస్ కాగలతో వేచి చూడాలి.