టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “విశ్వంభర”. అయితే ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఇంకా రిలీజ్ కాలేదు. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి గుడ్ న్యూస్ త్వరలోనే రాబోతున్నట్టుగా టాక్ నడుస్తుంది.
అయితే మొదట మే 9న అనుకున్నారు కానీ దానిని పవన్ తీసుకోవడంతో ఇపుడు మెగాస్టార్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ డేట్ ని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలా మెగాస్టార్ ఇంద్ర రిలీజ్ డేట్ జులై 24న విశ్వంభర రిలీజ్ చేయాలని ఇపుడు మేకర్స్ చూస్తున్నారట. దీనితో కొంచెం లేట్ అయినా కూడా మంచి సెంటిమెంట్ డేట్ లోనే మేకర్స్ వస్తున్నారని చెప్పవచ్చు. మరి దీనిపై అధికారిక డేట్ ఎపుడు వస్తుందో చూడాలి.