మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’పై మెగా అభిమానుల్లో ఇప్పటికే మంచి హైప్ ఉంది. త్రిష, ఆశిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి నుంచే సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఖరారు చేశారు. దీంతో ఆ రోజు మెగా ఫ్యాన్స్‌కు ప్రత్యేక గిఫ్ట్ అందనుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎం ఎం కీరవాణి అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
