విశాఖ ఉక్కు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనల్పమైన అవకాశవాద వైఖరిని ప్రదర్శించింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చిన తర్వాత ఆ సంస్థ ఉద్యోగులు, విశాఖ మరియు ఉత్తరాంధ్రవాసులలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఈ సమయంలో అక్కడ ఆందోళనలు కూడా మిన్నుముట్టాయి. ఆ సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానైనా ఆ పరిశ్రమను కాపాడడానికి ప్రయత్నించలేదు. అడుగు ముందుకు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో.. అనేక పర్యాయాలు హస్తినాపురం పర్యటించి వచ్చారు గాని, ఒక్కదఫా అయినా సరే నిర్దిష్టంగా విశాఖ ఉక్కు కోసం ఆయన ఒక విజ్ఞప్తిని కేంద్రం వద్ద పెట్టడమే జరగలేదు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి చేతకానటువంటి విజయాన్ని చంద్రబాబునాయుడు సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నమోదు చేసింది. విశాఖపట్నం ప్రైవేటీకరణ ఆలోచనే అంతరించిపోయింది. అదనంగా ఈ పరిశ్రమ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా 11,500 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తోంది.
‘ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్’ అంటూ ప్రజల ముందు దేబిరించి అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ అధికారం దక్కిన తర్వాత రాష్ట్ర పరిపాలనను ఎన్ని రకాలుగా గాడి తప్పించారో అందరికీ తెలుసు. పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కి ప్రజల జేబుల్లోకి నేరుగా కొంత డబ్బు పంపేయడం తప్ప మరొకటి కాదని, బటను నొక్కే సందర్భాలలో తప్ప ప్రజలకు కానీ మీడియాకు గాని కనిపించాల్సిన అవసరం లేదని, అప్పులు తేవడం ప్రజలకు పంచిపెట్టడం అనే రెండు పనులు మినహా రాష్ట్రం గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన, కష్టం చేయాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన ద్వారా నిరూపించారు. ఐదేళ్లపాటు ఆయన తీరుతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం అయిన దారుణమైన ఓటమిని ఆయనకు కట్టబెట్టారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షిత పట్ల తమ నమ్మకాన్ని వాళ్లు మళ్లీ నిరూపించుకున్నారు. దానికి తగ్గట్లుగానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఏ ఏ అంశాలు అయితే చేతకాకుండా పోయాయో వాటన్నింటినీ అత్యంత సులువుగా కార్యరూపంలోకి తీసుకువస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక రికార్డులను నమోదు చేస్తున్నది. ఇప్పటికే అనేక పారిశ్రామిక సంస్థలు ఏపీలో తమ యూనిట్లను ప్రారంభించడానికి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. విశాఖపట్నంకి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ హబ్ రాబోతోంది అనేక ఐటీ కంపెనీలతో విశాఖపట్నం ఒక ఐటీ దిగ్గజ నగరంగా అవతరించబోతోంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాధిస్తున్న విజయాలే! అదే సమయంలో ఇలాంటి విజయాలలో ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డికి చేతకాలేదు అని కూడా గుర్తించాలి అదే క్రమంలో విశాఖ ఉక్కు పరిశ్రమలు కాపాడడం కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దారిని సుసాధ్యం చేసింది కూడా రక్షణ కోసం ప్యాకేజీ కావాలంటూ చంద్రబాబు ఎన్ని విజ్ఞప్తులు చేశారో తెలియదు. గత ప్రభుత్వ కాలంలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో వారి వద్దకు వెళ్లి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంలో తనకున్న పరిచయాలతో ఉద్యోగుల కోరిక నెరవేరుస్తానని మాట ఇచ్చిన సంగతి కూడా మనకు గుర్తుంటుంది. ఎవరు ఎంత శ్రద్ధ పెట్టారో శ్రమ తీసుకున్నారో కానీ మొత్తానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎన్డీఏ సర్కారు పూర్తిగా అడ్డుకోగలిగింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పండగ చేసుకునే సందర్భం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
విశాఖ ఉక్కు : జగన్ కు చేతకానిది.. బాబు చేసిచూపారు!
Friday, January 17, 2025