ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్న విజయసాయి!

Wednesday, January 22, 2025

ఒకవైపు ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు గద్దె దించేయడానికి మార్గాలు ఏమైనా దొరుకుతాయా అని అన్వేషిస్తున్నారు. మరొకవైపు పార్టీ నాయకులు అసలు తమ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా లేదా.. అని భయపడుతూ ఉన్నారు. మరొకవైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి టెన్షన్లు ఇంకో రకంగా ఉన్నాయి. తనను భయపెడుతున్న టెన్షన్ల నుంచి బయటపడడానికి ఆయన ఇప్పుడు ఢిల్లీ పెద్దల చుట్టూ ఒంటరిగా తిరుగుతున్నారు.

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తో అనుబంధం ఏర్పడినప్పుడు.. విజయసాయి బహుశా ఇలాంటి పర్యవసానాలు వస్తాయని ఊహించి ఉండరు. ఆమె భర్త మదన్మోహన్ తెరపైకి వచ్చి..  సూటిగా తన మీదనే ఆరోపణలు చేయడం ప్రారంభించిన తరువాత విజయసాయి రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అసహనానికి గురవుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి అంతు తేలుస్తా అంటున్నారు. అదే సమయంలో ప్రశ్నలు అడగబోతే విలేకరుల మీద కూడా మండిపడుతున్నారు. మరొకవైపు విజయసాయి కి డీఎన్ఏ పరీక్ష చేయించాల్సిందే అంటూ శాంతి భర్త డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ లోని బిజెపి పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉన్న విజయసాయి వారిని వరుసగా కలుస్తున్నట్టు తెలుస్తోంది. వారు పూనుకుని కూటమి పెద్దల ద్వారా మదన్ మోహన్ ను సైలెన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 

శాంతి భర్త మదన్మోహన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అందువల్ల ఆయన మీద అడ్డదారుల్లో ఒత్తిడి తెచ్చి,  నోరు మూయించాలనేది విజయసాయి ఆలోచన. అయితే ఇలాంటి వివాహేతర సంబంధాల వంటి లేకి వ్యవహారాల్లో వేలు పెట్టడానికి డిల్లీ పెద్దలు ఒప్పుకుంటారా అనేది అందరి సందేహంగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles