వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అతి వేషాలు వేసినా నడిచిపోయాయి. అంతా విచ్చలవిడిగా ప్రవర్తించారు. ప్రజలకు కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ఓడించిన తర్వాత కూడా అదే విధంగా చెలరేగుతాం.. ప్రపంచం సహించాలి.. అంటే కుదరదు కదా..! వ్యవస్థలు వాటి పని అవి చేస్తాయి. అయితే ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కించిత్తు చర్య తీసుకుంటే చాలు.. తమను వేధిస్తున్నారని, టార్గెట్ చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారాలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు.
దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మీడియాలోకి రావడం తగ్గించారు. అంతకు ముందు.. ప్రతిపక్ష నాయకుల్ని విచ్చలవిడిగా తూలనాడుతూ సోషల్ మీడియాలో చెలరేగిపోతూ ఉండిన విజయసాయి ఆ జోరు కూడా తగ్గించారు. కానీ ఇప్పుడు ఆయన అనివార్యంగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. వివరణ లేదా ఖండన .. మనం ఏం అనుకున్నప్పటికీ.. సమాధానం చెప్పాల్సి వచ్చింది. దేవాదాయ శాఖలోని ఒక మహిళా ఉన్నతాధికారి వ్యవహారసరళి వైరల్ అయి వివాదాస్పదం కావడంతో విజయసాయి వివరణ ఇచ్చుకున్నారు.
ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరు ఉన్నారో తేలుస్తా అని విజయసాయి హెచ్చరిస్తున్నారు. మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని, మధ్యంతర ఎన్నికలు వచ్చినా కూడా మేమే గెలుస్తాం అని అంటున్న విజయసాయి, అప్పుడు అందరి తోకలు కత్తిరిస్తాం అని అంటున్నారు. అంటే.. ఇతర పార్టీల నాయకుల తోకలు కత్తిరించడానికే ప్రజలు తమకు మళ్లీ అధికారం ఇస్తారని ఆయన నమ్ముతున్నట్లుగా ఉంది.
తమకు మళ్లీ అధికారంలోకి వస్తే తోకలు కత్తిరిస్తాం అంటున్న విజయసాయిరెడ్డి ఇండైరెక్టు స్పీచ్ ఏమిన్నమాట..? ఇప్పుడు అధికారంలో ఉన్న వారు.. అదే రీతిగా తమ తోకలు కత్తిరించవచ్చు అనే కదా..! అని తెలుగుదేశం నాయకులు భాష్యం చెబుతున్నారు. మేం అధికారంలోకి వస్తే తోకలు కత్తిరిస్తాం అంటున్నవారు.. ఇప్పుడు తమ తోకల్ని కత్తిరింపజేసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉండాలి కదా.. అంటే కూటమి ప్రభుత్వానికి ఆమేరకు సంకేతాలు ఇస్తున్నట్టే కదా అని అంతా అనుకుంటున్నారు.
విజయసాయి ఇండైరెక్ట్ స్పీచ్ : మా తోకలు కత్తిరించండి
Wednesday, December 18, 2024