రఘు రాజు పై వేటు : జగన్ కు ఎదురు దెబ్బ!

Sunday, June 30, 2024

నిజానికి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ముందుగానే ఊహించిన చాలామంది నాయకులు ఆ పార్టీని విడిచిపెట్టి తమ భవిష్యత్తు తాము చూసుకోవడానికి చాలా కాలం ముందు నుంచే జాగ్రత్త పడ్డారు. అలాంటి వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందుకూరి రఘురాజు కూడా ఒకరు. ఆయన భార్య తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారు.

ఇందుకూరి రఘురాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండడంతో పసుపు కండువా కప్పుకోవడంపై దృష్టి పెట్టలేదు. అయితే నిబంధనలు, విధివిధానాలతో తమకు సంబంధం ఉండదని తాము తలచిందే రాజ్యాంగంగా తాము అనుకున్నదే చట్టంగా చెలరేగిపోవడం అలవాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయడం ద్వారా ఇందుకూరి రఘురాజు పై వేటు వేయించింది. ఈ విషయంలో ఇప్పుడు పార్టీకి ఎదురు దెబ్బకి తగిలేలా కనిపిస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా శాసన మండలి లో ఉంటూ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నందుకు మరో ఇద్దరి మీద కూడా వైసిపి మండలి చైర్మన్ మోషన్ రాజు ద్వారా అనర్హత వేటు వేయించడం అందరికీ తెలిసిందే. ఆ రెండు స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నిక కూడా జరగబోతుంది. ఆ రకంగా ఆ రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని అవకాశం కనిపిస్తుంది.

కాకపోతే ఇలా అధికారికంగా పార్టీలో చేరడం వలన వేటు పడే అవకాశం ఉన్నదని గ్రహించిన ఇందుకూరి రఘురాజు తన భార్యను మాత్రమే తెలుగుదేశం పార్టీలోకి పంపారు. ఆయన కండువా కప్పుకోలేదు. బహిరంగంగా ఎక్కడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు కూడా. అయితే ఆయన అనుచరులు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.

ఆ రకంగా రఘురాజు సాంకేతికంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలి చైర్మన్ తమ వాడే గనుక ఆయనకు ఫిర్యాదు చేసి వేటు వేయించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆయన మీద ఫిర్యాదు చేయించింది. అయితే అందుకు సంబంధించిన వారు ఎలాంటి రుజువులు, ఆధారాలు సమర్పించలేకపోయారు.

తనమీద అక్రమంగా అనర్హత వేటు వేశారని ఆరోపిస్తూ రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. తాజా పరిణామం ఏంటంటే రఘురాం మీద అనర్హత వేటుపడినప్పటికీ ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఇది రఘురాజుకి పెద్ద ఊరట కాగా, జగన్మోహన్ రెడ్డి అహంకారానికి మామూలు పార్టీ కార్యకర్త కొట్టిన పెద్ద దెబ్బగా పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles