పొల్లాచ్చిలో వెంకీ సాంగ్‌!

Sunday, December 22, 2024

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో వెంకీ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే, పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్నట్టు ఈ సినిమా టీమ్‌ ప్రకటించింది.

భాను మాస్టర్ కొరియోగ్రఫీ లో వెంకటేష్ – ఐశ్వర్య రాజేష్ ల పై ఓ సాంగ్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో భార్యభర్తలుగా వెంకటేష్ – ఐశ్వర్య రాజేష్ కనిపించబోతున్నట్లు మూవీ టీమ్‌ ప్రకటించింది. పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యంతో భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles