టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇక రెండు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు.
క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ కూడా డైరెక్షన్ బాధ్యతలు పంచుకున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాయాలని మేకర్స్ ఆశిస్తున్నారు.
ఇతీవలే ఈ సినిమా టికెట్ బుకింగ్స్‌ను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేశారు. బుకింగ్స్ మొదలైన వెంటనే అభిమానులు వెంటనే టికెట్లు బుక్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని థియేటర్లలో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయి కానీ మరో కొన్ని గంటల్లో అన్ని థియేటర్లలో పూర్తి స్థాయిలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి సమకూర్చారు. భారీ ప్రొడక్షన్ వ్యయంతో ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొన్న ఈ చిత్రం, రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.
