వరుణ్‌ మట్కా షూటింగ్‌ అప్డేట్‌..!

Sunday, December 22, 2024

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వరుణ్‌ గతేడాది గాంఢీవధారి అర్జున్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఈ ఏడాది ఆపరేషన్‌ వాలంటైన్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చి మెప్పించాడు. అయితే ఈ సినిమా కూడా అంత బాలేదు.

దీంతో వరుణ్‌ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్‌ తాజాగా నటిస్తున్న సినిమా మట్కా ఈ సినిమాని కరుణ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా బిగ్గెస్ట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా చేస్తుండగా..నవీన్‌ చంద్ర , అజయ్ ఘోష్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ నాలుగు డిఫరెంట్‌ రోల్స్‌ లో నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఆర్ఎఫ్‌సీ లో జరుగుతుంది.

ఈ సినిమా కోసం భారీ సెట్‌ ను చిత్ర బృందం వేసింది. ఈ సెట్‌ లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles