బాలీవుడ్‌ లోకి వకీల్‌ సాబ్‌ బ్యూటీ!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి జూనియర్ ఆర్టిస్ట్‌ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వకీల్‌ సాబ్‌ లో తన నటనకు గానూ మంచి పేరే సంపాదించింది. ప్రస్తుతం తన టాలెంట్‌ తో ప్రస్తుతం హీరోయిన్‌ గా నటిస్తుంది.  రీసెంట్ గా వచ్చిన తంత్ర సినిమా మాత్రం అనన్యకు మంచి హిట్ ను ఇచ్చింది

ఈ జోష్ తో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు ను అందుకుందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ లోకి ఈ అమ్మడు ఎంట్రీ ఇవ్వడం ఏంటి అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. కానీ ఇది నిజం.. కానీ ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం లేదు.. రైటర్ గా ఎంట్రీ ఇచ్చిందంట.. ‘మల్లేశం’ సినిమా డైరెక్టర్ రాజ్ రాచకొండ తీసిన హిందీ సినిమా ‘8 ఏఎం మెట్రో’ సినిమా కథకు తన సహకారం అందించినట్లు సమాచారం.

ఈ విషయాన్ని స్వయంగా అనన్యనే  చెప్పుకొచ్చింది.. ఆ సినిమా ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమా మొదట్లో.. అనన్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక స్లైడ్ ఉంది. దానిని అనన్య షేర్ చేసింది. మొత్తానికి బాలీవుడ్ లో ఏదోక విధంగా పాగా వెయ్యబోతుందని  గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి టాక్ ను అందుకుంది. ఇక ‘పొట్టేల్’ తో మరో సారి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles