యంగ్ హీరో అశ్విన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ “వచ్చినవాడు గౌతమ్” ప్రస్తుతం మంచి హైప్‌ని సెట్ చేసుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇందులో అశ్విన్ చూపించిన ఇంటెన్స్ యాక్షన్ మరియు స్టైల్ సోషల్ మీడియాలో విశేషంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ సినిమాకి మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గణపతి రెడ్డి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది. పవర్ ఫుల్ మేకోవర్‌తో ఉన్న ఆ పోస్టర్‌కి నెట్టింటి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా క్లైమాక్స్ ఎపిసోడ్‌ని భారీగా చిత్రీకరించారు. అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కించిన ఈ యాక్షన్ సీన్ సినిమాకి హైలైట్‌గా నిలవబోతుందనే టాక్ వినిపిస్తోంది. రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, VTV గణేష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా గౌర హరి పని చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా, త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రావొచ్చని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, ఈ సినిమా యాక్షన్ ప్రియులకు కొత్త అనుభూతి కలిగించబోతోందన్న నమ్మకంతో అశ్విన్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
