స్పిరిట్‌ మూవీ పై అప్డేట్‌ ఏంటంటే!

Sunday, December 22, 2024

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘దేవర’ టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌ లో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్‌’ అనే సినిమా చేయబోతున్నట్లు టాక్‌ నడుస్తుంది. ఈ క్రేజీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు విడుదల అవుతుంది ? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే, కథ, స్క్రీన్ ప్లే పూర్తి చేసిన సందీప్ రెడ్డి, ప్రస్తుతం సినిమాకి మాటలు రాసి పూర్తి చేసే పనిలో ఉన్నట్లు టాక్‌. ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుండట. అలాగే, సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ వైల్డ్ ఎలిమెంట్స్ సినిమాలో ఫుల్ గా ఉంటాయని సమాచారం.

అలాగే ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడని కూడా టాక్. పైగా ఇప్పటికే, ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ పాత్రలోని డెప్త్ కూడా నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles