ఊహించలేమంతే…!

Wednesday, January 22, 2025

ఐకాన్ స్టార్, జాతీయ నటుడు  అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా మోస్ట్‌ అవైటెడ్ సీక్వెల్ మూవీ  “పుష్ప 2 ది రూల్” పట్ల పాన్ ఇండియా ఆడియెన్స్ లో ఎలాంటి హైప్ ఉందో తెలిసిందే. మరి ఈ సినిమాని ఆల్రెడీ మేకర్స్ పాన్ ఇండియా వైడ్ గా నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టారు. అయితే ఇపుడు ఒక ఊహించని క్రేజీ అనౌన్సమెంట్ ని అయితే చిత్ర బృందం అందించిందని చెప్పుకోవచ్చు.

ప్రెజెంట్ యువత అంతా వీడియో గేమ్స్ ని ఏ లెవెల్లో ఆడుతుంటారో తెలిసిన విషయమే. అలా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫేమ్ ఉన్న అడ్వెంచర్ గేమ్స్ లో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అంటే ఈ కాలంలో తెలియని వారు ఉండరు.

మరి అలాంటి గ్లోబల్ రీచ్ ఉన్న గేమ్ తో పుష్ప మేకర్స్ ఇపుడు కొలాబ్ అయ్యినట్టుగా ఓ క్రేజీ అప్డేట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు

గేమ్ పై కొన్ని విజువల్స్ అందులో పుష్ప రాజ్ ఎంటర్ అవుతున్నట్టుగా తన క్యారెక్టర్ ని టీజ్ చేస్తూ చిన్న గ్లింప్స్ అయితే తీసుకుని వచ్చారు. దీంతో పుష్ప టీం మాత్రం ఒక ఊహించని ప్లానింగ్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles