బాలీవుడ్‌ బాద్‌ షా పక్కన టాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ సమంత గతేడాది ఖుషీ సినిమా తరువాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు తాజాగా వరుస సినిమాలతో బిజీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సామ్ తన ఓన్‌ ప్రొడక్షన్‌ లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తుంది. అటు రీసెంట్ గానే ఓ మాలీవుడ్ లో కూడా ఓ ఆఫర్ అందుకుంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో మమ్ముట్టి కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో సామ్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇక తాజాగా బాలీవుడ్ లో కూడా ఓ భారీ అఫర్ అందుకున్నట్లు సమాచారం.

లేటెస్ట్ బాలీవుడ్ టాక్ ప్రకారం.. సమంత బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్‌ సరసన యాక్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరానీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దేశభక్తితో కూడిన యాక్షన్‌ అడ్వంచరస్‌ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించనున్నారంట.

 సమంత ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.  ఇప్పుడు షారుఖ్ సినిమాతో హీరోయిన్ గా రీ లాంచ్ అవుతుండటం విశేషం. కాగా షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో గత ఏడాది వచ్చిన ‘డంకి’ మూవీ కమర్షియల్ గా హిట్‌  కానప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా రాబోతుందనే న్యూస్ బయటకి రావడంతో అప్పుడే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మొదలైయ్యాయి. మరి ఈసారైనా ఈ కాంబో కమర్షియల్ గా భారీ విజయాన్ని అందుకుంటుదేమో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles