తల్లి కాబోతున్న టాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

Friday, December 27, 2024

టాలీవుడ్‌ హీరోయిన్‌  చిత్ర శుక్లా ఓ శుభవార్త ను అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే తాను తల్లి కాబోతున్నా అని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. కుటుంబసభ్యుల మధ్య సాంప్రదాయబద్దంగా జరిగిన తన సీమంతం వేడుకలకు సంబందించిన పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు చిత్ర శుక్లాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మధ్యప్రదేశ్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్ వైభవ్ ఉపాధ్యాయ్‌ని చిత్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్ర శుక్లా 2014లో ‘ఛల్ భాగ్’ హిందీ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పులి, నేను శైలజ చిత్రాల్లో సైడ్ డ్యాన్సర్‌గా మెరిసింది. 2016లో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘మా అబ్బాయి’ సినిమాతో చిత్ర హీరోయిన్ గా మారింది.

తెలుగులో రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ సినిమాల్లో నటించారు. రంగుల రాట్నం తప్ప మిగతావి అన్నీ ఆమెకు పెద్దగా పేరును తీసుకురాలేదు. చివరగా ‘అహో విక్రమార్క’ సినిమాలో చిత్ర కనిపించారు.2023 డిసెంబర్‌లో వైభవ్ ఉపాధ్యాయ్‌ని చిత్ర శుక్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పోలీస్‌ అధికారిగా వైభవ్ పనిచేస్తున్నారు.

బయోటెక్నాలజీ పూర్తి చేసిన చిత్రకు.. కాలేజీ రోజుల్లోనే వైభవ్‌తో పరిచయం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles