కల్కి కోసం రంగంలోకి దిగిన టాలీవుడ్ సూపర్‌ స్టార్‌!

Sunday, December 8, 2024

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పోయిన సంవత్సరం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా 700 కోట్లకు వసూళ్లు ను కొల్లగొట్టింది. ఇదిలా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తూ, ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “కల్కి 2898 ఏడి ” ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తీర్చిదిద్దుతున్నారు.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ,బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ స్టార్లంతా నటిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ,దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్  సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.

కల్కి లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వినిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ మహేష్ బాబును సంప్రదించారని తెలుస్తుంది. కల్కి లో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. దీనితో విష్ణు అవతారంలో ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles