కొత్త ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ బుట్టబొమ్మ!

Tuesday, May 21, 2024

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు పూజా హెగ్డే.కొంత కాలం క్రితం వరకు వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఒకటో,రెండో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడూ ఒకటో రెండో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ భామ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిన విషయమే.

తనకు సంబందించిన ప్రతి చిన్న విషయాన్ని, లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు కొత్త ఇల్లు కొన్నదన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంది.. తన కొత్త ఇంటికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.పూజా హెగ్డే తాజాగా కొత్త ఇల్లు కొన్నట్లు సమాచారం.

తాజాగా పూజా హెగ్డే తన కొత్త ఇంట్లోకి మారారు … ఈ కొత్త ఇల్లు ముంబైలోని బాంద్రాలో ఉన్నది. ఇప్పటికే అక్కడ చాలా మంది ప్రముఖుల ఇళ్లు ఉన్నాయి.  ఇప్పుడు పూజా కొన్న ఇల్లు ఖరీదు రూ.45 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.. గతంలో పూజా మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది..

4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన స్థలంలో సముద్రానికి దగ్గరలో ఉన్న ఈ కొత్త ఇంటికి పూజా మకాం మార్చింది. సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. తెలుగులో పెద్దగా సినిమాలు చెయ్యలేదని తెలుస్తుంది..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles