బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న టాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

Wednesday, July 24, 2024

టాలీవుడ్‌ క్యూట్‌ ముద్దుగుమ్మ శ్రీలీల …మొదటి సినిమాతోనే స్టార్‌ ఇమేజ్‌ ను సొంతం చేసుకుని అగ్ర హీరోలందరితో చేసి మంచి పేరు సంపాదించుకుంది. టాలీవుడ్‌ లో శ్రీలీల లుక్స్‌, డ్యాన్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ తరువాత శ్రీలీల కు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఒకానొక సమయంలో డేట్స్ అడ్జస్ట్ కాక  చాలా సినిమాలను ఈ  ముద్దుగుమ్మ వదులుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ భామకు వరుస ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ అదృష్టం మాత్రం ఏం కలిసి రాలేదు.

ఈ భామ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ శ్రీలీల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తుంది.  అయితే ఆ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం గ్యాప్‌ వచ్చింది. మళ్లీ త్వరలోనే  స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ న్యూస్‌ బాగా వైరల్ అవుతుంది. కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దిలర్ సినిమాలో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన శ్రీలీల నటిస్తున్నట్లు ఓ వార్త బాగ్ వైరల్ అవుతుంది.  

త్వరలోనే ఈ విషయం గురించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles