తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది ఆర్.జె. బాలాజీ. గతంలో కామెడీ, ఫ్యామిలీ థీమ్‌లతో గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ ఈసారి సీరియస్ యాక్షన్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. టైటిల్‌తోనే ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మంచి ఆసక్తి మొదలైంది.
ఈ సినిమా నుంచి మొదటి అఫిషియల్ అప్డేట్ రాబోతోంది. సూర్య పుట్టినరోజు అయిన జూలై 23 ఉదయం 10 గంటలకు ‘కరుప్పు’ టీజర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సమాచారం ఇచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సూర్య స్టైలిష్ యాక్షన్ లుక్‌లో దర్శనమిచ్చాడు. మాసీవ్ యాటిట్యూడ్‌తో నడుచుకుంటూ వస్తున్న ఆ స్టిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇక టీజర్ విషయంలో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం, టీజర్‌ను ఎనర్జిటిక్‌గా, థ్రిల్‌గా కట్ చేశారని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండడం కూడా ప్రేక్షకుల్లో మరింత క్యూయాసిటీ పెంచింది.
సూర్య సినిమాలంటే మాస్, మెసేజ్, ఎమోషన్ మిక్స్ అయి ఉండేలా ఉంటుంది. అలాంటి కథే ‘కరుప్పు’లోనూ ఉండబోతోందా అనే దానిపై జవాబు టీజర్ ద్వారా వచ్చేస్తుంది. మరి ఈ కొత్త రూపంలో సూర్య ఎలా కనిపించబోతున్నాడో చూడాలంటే రేపు ఉదయం వరకు ఆగాల్సిందే.
