“మెకానిక్ రాకీ” విడుదల తేదీ ప్రకటన కి టైమ్ ఫిక్స్!

Tuesday, January 21, 2025

టాలీవుడ్ యంగ్‌ హీరో, స్టార్ డైరెక్టర్‌ మాస్‌ కా దాస్ విశ్వక్ సేన్ చివరిసారిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కనిపించి మెప్పించాడు. అయితే ఈ సినిమా దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది. విశ్వక్‌ తన తరువాత సినిమా దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ అనే సినిమాని చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీ పై  చిత్ర బృందం ఒక అప్డేట్ ను ఆడియెన్స్ ముందుకు తీసుకుని వచ్చారు. శుక్రవారం సాయంత్రం 5:05 గంటలకు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇదే విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు మూవీ మేకర్స్‌. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, జేక్స్ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీతో పాటుగా విశ్వక్ సేన్ మరికొన్ని చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles