భవిష్యత్తు కోరుకునే వారు నోరు తెరవడం లేదు!

Wednesday, January 22, 2025

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక చిత్రమైన పరిణామం కనిపిస్తోంది. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కి శాసనసభకు రావడం అంటే ఇష్టం లేకపోవడంలో వింత లేదు.. పూలమ్మిన చోట రాళ్లమ్మడం ఆయనకు చిన్నతనంగా ఉండొచ్చు. అయితే ఆయన కనీసం తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న తాడేపల్లి ప్యాలెస్‌లో ఉండడానికి కూడా ఇష్టపడడం లేదు.

తన పరిసరాలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం సాగుతూ ఉన్నదనే ఊహ ఆయనను కుదురుగా నిలవనివ్వడం లేదు. అందుకే ఆయన రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ బెంగుళూరు పారిపోయారు.

అధినేత పరిస్థితి యిలా ఉంటే.. ఆ పార్టీకి చెందిన ముఖ్యమైన సీనియర్ నాయకులు మరోరకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు  మీద ఆశ ఉన్నవారు ఆచితూచి వ్యవహరిస్తూ ఉండడం విశేషం. అలాంటి నాయకులు ఎవరూ చంద్రబాబు మీద సూటిగా విమర్శలు చేయడానికి సాహసించడం లేదు. వీరిలో వైసీపీ నుంచి ఫిరాయించి కూటమి పార్టీలలో చేరడానికి ఎందరు మంతనాలు సాగిస్తున్నారో తెలియదు.

విషయం ఏంటంటే .. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెలరోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. కొత్త ప్రభుత్వాన్ని కాస్త తిడితే బాగుంటుంది అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఎప్పుడు తిట్టినా సరే తలా తోకా లేకుండా, మినిమం లాజిక్ లేకుండా ఎడాపెడా తిట్టడం సాగిస్తుంటారనే సంగతి అందరికీ తెలుసు.

అలాంటి అర్థం పర్థం లేని తిట్లకు కూడా స్క్రిప్టులు ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తాయనే సంగతి కూడా అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నెలకొన్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తిట్టడానికి పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు.

సీనియర్ మాజీ మంత్రులు, కొమ్ములు తిరిగిన పార్టీ నాయకులు ఎవరు చంద్రబాబు సర్కారు మీద చిల్లర విమర్శలు కురిపించడానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ రాజకీయ సన్యాసం తీసుకుని.. కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు, ఎన్నికల సీజన్లో ప్రెస్ మీట్ లు పెట్టి తెలుగుదేశాన్ని నిందిస్తూ వచ్చిన పేర్ని నాని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెసుకు మరొకరు గతి లేనట్లుగా ఉంది.

నాని ప్రెస్ మీట్ పెట్టి నెల రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదంటూ, పెన్షన్లు ఇవ్వడం తప్ప మరో పని జరగలేదని అంటూ.. చాలా అద్భుతంగా తన అజ్ఞాన ప్రదర్శన చేశారు. పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును నిందిస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉండే పరిస్థితి. కాస్త లాజికల్ గా నిందించడానికి తిట్లు తిట్టడానికి వైసీపీకి మరొక నేతకు గతి లేదా అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles