ఈ వారం కూడా మహావతార్ దే!

Monday, December 8, 2025

ఇటీవలి కాలంలో పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన హిట్ అందుకున్న సినిమా గురించి చెప్పాలంటే, దానిపై అందరి దృష్టి మహావతార్‌  నరసింహ సినిమా మీదే ఉంది. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ యానిమేటెడ్ భక్తిరస చిత్రం ప్రేక్షకుల హృదయాలను అలరించింది. విడుదలైన మొదటి రోజునుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు కూడా సినిమాని చూసేందుకు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే రెండు వారాల పాటు సక్సెస్ ఫుల్ గా నడిచిన ఈ సినిమా, మూడో వారంలో కూడా అదే జోరుతో కొనసాగుతోంది. గత రెండు వారాల్లో పెద్ద సినిమాల పోటీ మధ్యలోనూ నిలబడి మంచి టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం, ఇప్పుడు పెద్దగా కొత్త సినిమాలు లేకపోవడంతో మళ్లీ థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ వారాంతంలో మరోసారి ప్రేక్షకులను థియేటర్లను ఫుల్‌ చేసింది.

ఈ సినిమాకు సంగీతం అందించిన సామ్ సి ఎస్ తన పని లోనూ మెప్పించారు. క్లీం ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, భక్తిరసంతో పాటు వినోదాన్ని కలిపి అందరినీ ఆకట్టుకుంది. యానిమేషన్ చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించడం వలన, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై కూడా ఈ సినిమా మీద భారీ ఆసక్తి నెలకొంది.

మొత్తం మీద, పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహావతార్ నరసింహ, ఇంకా కొన్ని వారాలు హవా చూపించేలా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles