ఆనాటి జగన్ అహంకారానికి ఇది భంగపాటు!

Friday, December 5, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకపాలన సాగిస్తున్న రోజుల్లో.. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రీతిగా జరిగాయో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకించి మునిసిపాలిటీ ఎన్నికల సమయంలో.. నామినేషన్లు వేయాలంటేనే.. అప్పటి తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన వారు వణికిపోయారంటే అతిశయోక్తి కాదు. ఆ పార్టీల వారు నామినేషన్లు సిద్ధం చేసుకుంటే.. వారిని కిడ్నాపులు చేసి, పోలీసుల ద్వారా నిర్బంధించి.. వేయడానికి వెళుతున్న వారిని మధ్యలో పోలీసులతో నిర్బంధంలోకి తీసుకుని, తమ గూండాలతో దాడులు చేయించి.. వారి నామినేషన్ పత్రాలను చింపేయించి.. ఇలా రకరకాల మార్గాల్లో అసలు నామినేషన్లే పడకుండా చేయడం ద్వారా.. మెజారిటీ స్థానాల్లో తాము గెలిచాం అని చాటుకున్నది వైఎస్సార్ కాంగ్రెస్. అందుకు తగిన ఫలితం ఇప్పుడు వారికి ఎదురవుతోంది. గుణపాఠం ఇప్పుడు నేర్చుకుంటున్నారు.

మునిసిపాలిటీ ఎన్నికలు పూర్తయిన తర్వాత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నూ మిన్నూ కానకుండా.. ఆ విజయాలు సాధించడానికి తాము చేసిన అరాచకాల్ని మర్చిపోయి.. మితిమీరిన అహంకారం ప్రదర్శించారు. ఆ తర్వాతి అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పుడు.. ప్రారంభం రోజున బీఏసీ సమావేశానికి వచ్చిన అచ్చెన్నాయుడుతో.. అత్యంత వెటకారంగా.. ‘ఎక్కడబ్బా మీ నాయకుడిని ఒకసారి కనిపించమను.. మొహం చూడాలని ఉంది’ అంటూ హేళన చేశారు జగన్.
అలా హేళన చేయడానికి కారణం ఉంది. చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం మునిసిపాలిటీని వైసీపీ దక్కించుకుంది. అందుకోసం అక్కడ ఎన్నెన్ని అక్రమాలు చేయవచ్చునో అన్నీ చేశారు. మొత్తానికి చంద్రబాబు గురించి అహంకారంతో అలా హేళన చేశారు. మునిసిపాలిటీని దక్కించుకున్న విధంగానే.. కుప్పం శాసనసభ నియోజకవర్గాన్ని కూడా తాము గెలుచుకుంటాం అని అప్పట్లో విర్రవీగారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు.

కుప్పం మునిసిపాలిటీ ఛైర్మన్ సార్వత్రిక ఎన్నికల తరువాత రాజీనామా చేయడంతో.. ఇక్కడ సోమవారం ఆ స్థానానికి ఎన్నిక జరిగింది. చివరి నిమిషాల్లో వైసీపీ తరఫున గెలిచిన నలుగురు కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. ఎక్స్ అఫీషియో సభ్యుడి ఓటు ఒకటి ఉంది. మొత్తానికి ఈ ఎన్నికకు తెలుగుదేశం అభ్యర్థి సెల్వరాజ్ కు 15 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో వైసీపీ తరఫున కేవలం 8 మంది మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. దీంతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఎన్నికలు జరిగినప్పుడు అరాచకత్వంతో దక్కించుకుని, అహంకారం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డికి భంగపాటు తప్పలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles