ఈ సినిమా దానికి రీమేక్‌ కాదు..క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌!

Friday, July 5, 2024

అల్లు వారి చిన్న వారసుడు శిరీష్‌..ఆయన నటిస్తున్న సినిమా బడ్డీ…ఈ సినిమా వచ్చే నెల 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సిఇనమాకి సంబంధించిన టరైలర్ లాంచ్‌ ఈవెంట్‌ తాజాగా హైదరాబాద్‌ లో చాలా గ్రాండ్‌ గా జరిగింది. అయితే ఈ సినిమా ఇంతకుముందు వచ్చిన తమిళ హీరో ఆర్య నటించిన సినిమా టెడ్డీకి రీమేక్‌ అంటూ చాలా మంది అనుకుంటున్నారు.

అయితే ఆ విషయాల్ని అల్లు శిరీష్‌ తాజాగా ఖండించాడు. ఈ సినిమాకి సంబంధించిన మొదటి పోస్టర్‌ విడుదలైన రోజు నుంచి చాలా మంది మమ్మల్ని రీమేక్‌ కు ఎందుకు మొగ్గు చూపారని అడిగినట్లు తెలిపారు. ఈ సినిమా రీమేక్‌ కాదని తాజాగా విడుదలైన ట్రైలర్‌ ని చూస్తే అది మీకే అర్థమవుతుందని అనుకుంటున్నాను అంటూ మాట్లాడాడు.

సినిమా ఓ వినూత్న ప్రయత్నం అని ముందు తాను కూడా భయపడ్డానని…ప్రజలు ఈ సినిమాని ప్రేక్షకులు అంగీకరిస్తారా లేదా అన్న విషయం గురించి కూడా తాను భయపడ్డానని చెప్పుకొచ్చాడు. పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా…కంటెంట్‌ ఉన్న సినిమా అయితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని శిరీష్‌ చెప్పుకొచ్చాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles